హెల్మెట్ ధరించి వెళ్లే ద్విచక్ర వాహనదారులను ఆపి ఇతర పత్రాలను తనిఖీ చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులకు ఆదేశించారు. హెల్మెట్ ధారణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ వాడకాన్ని మరింత పెంపొందించడానికి కృషి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు ఆయన సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు మాత్రం జరిమానా తో పాటు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తనిఖీలలో చూపించాలని లేకుంటే అన్నింటికి కలపి జరిమానా విధించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
previous post
next post