34.2 C
Hyderabad
April 19, 2024 22: 22 PM
Slider ముఖ్యంశాలు

మతిస్థిమితం లేని ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే చెప్పండి

#KhammamPolice

ఖమ్మం నగరంలోని అన్నం ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్న ఒక మానసిక వికలాంగుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తన పేరును బాబు అని అతడు చెబుతున్నారు. వయసు 35 సంవత్సరాల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

గత ఏడాదిగా ఖమ్మం నగరంలోని అన్నం పౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. సత్య  పెద్ది, చిన్న బుజ్జి అనేవి తల్లిదండ్రుల పేర్లు గా అతను చెబుతున్నాడు తప్ప మిగిలిన పూర్తి వివరాలు తెలియడం లేదు.

మానసికంగా సరిగాలేని ఈ ఫొటోలోని వ్యక్తికి  సంబంధించిన వారు ఏవరైనా అందుబాటులో వున్నా  లేదా వారి సమాచారం తెలిసినా కుటుంబం సభ్యుల వద్దకు చేర్పించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు సహకారించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఓ ప్రకటనలో కోరారు.

కోస్తా ఆంధ్ర యాసలో మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఏన్కూర్ మండలం కొనయపాలెం గ్రామానికి చెందిన వాంకుడోత్  హథీరామ్ ఇంటి వద్ద  కొంతకాలం ఆశ్రయం పొందాడు

తర్వాత గత సంవత్సర కాలం నుండి ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నాడు. ఇతని కుటుంబ సభ్యుల ఆచూకీ వివరాలు తెలిస్తే ఈ కింది నెంబర్లకు సమాచారం అందించగలరని మనవి.

సబ్ ఇన్ స్పెక్టర్ ఎన్కూర్ సెల్ నెం 94409 04272, సర్కిల్ ఇన్ స్పెక్టర్ వి ఎం బంజార్ 94407 95331. సమాచారం అందించిన వారికి పారితోషికం కూడా అందచేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ తెలిపారు.

Related posts

కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రతి శాఖలో అధికారిని నియమించాలి

Satyam NEWS

డివిజన్ లో వెయ్యి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలి

Bhavani

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు

Bhavani

Leave a Comment