30.7 C
Hyderabad
April 24, 2024 02: 38 AM
Slider ఖమ్మం

క్రీడలలో మరింతగా మరింతగా రాణించాలి

#khammam police

క్రీడల్లో మరింతగా  రాణించి భారత జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా మరింతగా కృషి చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్  విష్ణు యస్ వారియర్ అన్నారు.   కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొండయ్య తన  కుమారుడు విశాల్ యాదవ్ ను (క్రికెట్), కూతురు వైశాలి  (అథ్లెటిక్స్) లు అంచెలంచెలుగా ఎదగడంలో సహకరించి జాతీయ స్ధాయి పోటీలలో పాల్గొనేలా  ప్రోత్సహించిన  కొండయ్యను  కుమారుడు, కూతురు  ను సోమవారం సి పి అభినందించారు.

ఖమ్మం టూ టౌన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న  కొండయ్య  శిక్షకుడిగా మారి చిన్ననాటి నుండి పిల్లలకు  క్రీడల పట్ల మక్కువ పెంచారు.

అండర్ 14,16 లో ఐదుసార్లు జాతీయ స్ధాయి క్రికెట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమిలో శిక్షణ పొందుతున్న విశాల్  2017 నుంచి 2019 వరకు అండర్-14, 16 పలు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు జిల్లా, రాష్ట్ర జట్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. జిల్లా 2019లో భద్రాద్రి కొత్తగూడెంలో  అండర్ 16 రాష్ట్రస్థాయి క్రికెట్ రాష్ట్ర పోటీలు నిర్వహించారు.  హైదరాబాదు జట్టుతో జరిగిన ఫైనల్ అదే తొలిసారి మ్యాచ్ లో విశాల్ 25 బంతుల్లో  70 పరుగులు సాధించాడు.

కూతురు వైశాలి లాంగ్ జంప్, 100 మీటర్ల పరుగు పందెంలో రెండు సార్లు జాతీయ స్ధాయి క్రీడలలో పాల్గొన్నారని కానిస్టేబుల్  కొండయ్య వివరించారు.

Related posts

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

Satyam NEWS

ట్రాన్సజెండర్ ను వివాహం చేసుకున్న యువకుడు

Bhavani

చదువురాని ఆశావర్కర్ల తో ఇబ్బందులు

Satyam NEWS

Leave a Comment