28.7 C
Hyderabad
April 25, 2024 05: 36 AM
Slider ఆదిలాబాద్

వరదలో చిక్కుకున్న రైతుల్ని రక్షించిన ఖానాపూర్ పోలీసులు

#KhanapurPolice

పంటచేల కాపలాకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు రైతులను ఖానాపూర్ పోలీసులు రక్షించారు.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన పూస మల్లయ్య, చేలివేరి తిరుపతిలు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మేడంపల్లె గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.

గురువారం సాయంత్రం అడవి జంతువుల బారి నుండి పంటను రక్షించుకునేందుకు కాపల వచ్చి తిరిగి శుక్రవారం ఉదయం స్వస్థలానికి బయలుదేరి వెళ్లేందుకు గోదావరి నది దాటుతుండగా ప్రవాహం ఒకేసారి పెరగడంతో గోదావరి మధ్యలో గల కుర్రు పైకి చేరారు.

ప్రాణాలు రక్షించు కునేందుకు ఆరాట పడుతూ ఉండగా పశువుల కాపర్లు గమనించి ఖానాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖానాపూర్ ఎస్ఐ జాలార్లుతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వారిని తాళ్ల  సాయంతో రక్షించారు. ఒడ్డుకు చేర్చారు వారు బయంతో బిక్కుబిక్కుమని అరచేతిలో ప్రాణంతో ఒడ్డుకు వచ్చారు.

ప్రత్యకంగా జాలర్లకు ఖానాపూర్ సిఐ శ్రీధర్ గౌడ్, ఖానాపూర్ ఎస్ఐ భవాని సేన్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

13 నుండి కాకినాడలో కంచి కామకోటి పీఠాధిపతి చాతుర్మాస్యదీక్ష

Satyam NEWS

వాహనాల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

Satyam NEWS

అలీని పరామర్శించిన మంత్రి తలసాని

Satyam NEWS

Leave a Comment