Slider సినిమా

బర్త్ డే గిఫ్ట్: ‘ఖేల్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

sukumar pandu

ప్రముఖ నిర్మాత గొట్టిముక్కల పాండురంగారావు సారథ్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ‘ఖేల్’ సినిమా ఫస్ట్ లుక్ ని శనివారం లాంఛనంగా ఆవిష్కరించారు. సంచలన దర్శకుడు సుకుమార్  ఖేల్ ఫస్ట్ లుక్ ని మాదాపూర్ లో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ, తన పుట్టినరోజున ఖేల్ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చక్కటి కథాంశంతో తెరకెక్కిన ఖేల్ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయవంతం అవుతుందని అభిలషిస్తూ,  నిర్మాత గొట్టిముక్కల పాండురంగారావును ఈ సందర్భంగా అభినందించారు.

సుకుమార్ జన్మదినం సందర్భంగా పాండురంగారావు ఆయనకు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పరస్పరం ఒకరినొకరు అభినందించుకున్నారు.  సుకుమార్ పుట్టిన రోజున తమ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగడం పట్ల ఆనందం వెలిబుచ్చారు నిర్మాత పాండురంగారావు.

Related posts

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

mamatha

నాటుసారా పై అవగాహన కు షార్ట్ ఫిలిం

Satyam NEWS

సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న చోట బిజెపి బలంగా ఉంటుంది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!