37.2 C
Hyderabad
March 29, 2024 17: 42 PM
Slider మహబూబ్ నగర్

ఖిల్లా ఘనపూర్  పోలీస్టేషన్ ను తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ

#rakshitamurthyips

వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం  వనపర్తి జిల్లా పరిధిలోని ఖిల్లా ఘనపూర్ మండల  పోలీస్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి  తనిఖీ చేశారు. పెండింగ్ లో  ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఘనపూర్  ఎస్సై కె. శ్రీహరిని అడిగి తెలుసుకున్నారు.

పోలీస్టేషన్ లో  రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్టేషన్  రిసెప్షన్, లాకప్ ,మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ ను సందర్శించి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం నమోదు చేసిన రిసెప్షన్ డైరీని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  విధుల పట్ల అంకితభావంగా ఉండాలని,  ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.  న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

ఘనపూర్ మండలంలో అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే  తనిఖీ చేయాలని సూచించారు. అక్రమ మార్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా  ప్రజలకు చైతన్య పరచాలని పేర్కొన్నారు.

ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ – 100 ద్వారా తెలుపవచ్చని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్  పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు,  పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు. ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పీ  అనదరెడ్డి, కొత్తకోట సీఐ, శ్రీనివాసరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఇష్టారాజ్యంగా వైన్ షాప్ ల ఏర్పాటు…

Satyam NEWS

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS

ఘనంగా లంబాడీల ఆరాధ్యదైవం శీతల పండుగ

Satyam NEWS

Leave a Comment