25.2 C
Hyderabad
January 21, 2025 11: 35 AM
Slider క్రీడలు

తొలి ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ఆవిష్కరణ

#minister

భారత్ వేదికగా జనవరి 13–19వ తేదీల మధ్య ఖో ఖో ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలోని రవాణా, యువజన, క్రీడాలశాఖ మంత్రి కార్యాలయంలో అద్దంకి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఖో ఖో అసోసి చైర్మన్ బీ.సీహెచ్ గరటయ్య అధ్వర్యంలో ఖో ఖో ప్రపంచ కప్‌ పోస్టర్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. దేశ రాజధానిలో ప్రపంచ కప్‌ నిర్వహిస్తుండటాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటం చూసి ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వారం రోజుల పాటు జరిగే  ఖో ఖో ప్రపంచ కప్‌లో టోర్నమెంట్‌లో 21 పురుషుల, 20 మహిళల జట్లు పోటీపడతాయి.  మొత్తం 24 దేశాల జట్లు టోర్నమెంట్ కోసం భారత్‌కు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ఖో ఖో అభిమానులకు ఈ ఆటలోని అనుభవాన్ని ఈ టోర్నమెంట్ అందించనుందని, ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలను అందించడంపై దృష్టి సారిస్తోందని అందుకే, పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన వేదికను ఏర్పాటు చేశామని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

Satyam NEWS

‘మీతోనే మేం దేనికైనా’ కరపత్రాల పంపిణీ

mamatha

కరోనాపై పోరాటానికి ముందుకు వచ్చిన భారత ఆర్మీ

Satyam NEWS

Leave a Comment