30.2 C
Hyderabad
February 9, 2025 20: 14 PM
Slider క్రీడలు

ఖో ఖో ప్రపంచ కప్ 13 నుంచి ఆరంభం

#khokho

ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రీ-టోర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడంతో దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం ఆదివారం హడావుడిగా కనిపించింది. ఈ ట్రోర్నమెంట్ లో పాల్గొనే 23 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ వివిధ దేశాల సాంస్కృతిక వైవిధ్యం కళ్లకు కట్టినట్లు చూపించింది. ఖో ఖో ప్రపంచ కప్ 2025 జనవరి 13 నుండి 19 వరకు జరగబోతున్నది.

వివిధ జట్లకు చెందిన క్రీడాకారులు భారతీయ సంప్రదాయ సంగీతంతో స్వాగతం పలుకుతూ కార్యక్రమాలకు రంగులు దిద్దారు. విలేకరుల సమావేశం సాంస్కృతిక మార్పిడి వేడుకగా మారిందనడంలో సందేహం లేదు. ఆఫ్రికన్ బృందాలు చేసిన యుద్ధ ప్రదర్శన ఉత్సాహాన్ని నింపింది. ఐరోపా దేశాలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. “ఖో ఖో చాలా అందమైన క్రీడ. ఇక్కడ మీరు మీ మనస్సును నిమగ్నం చేస్తూనే స్వేచ్ఛగా సాగిపోవచ్చు” అని పోలాండ్ జట్టుకు చెందిన 24 ఏళ్ల కొన్రాడ్ అన్నాడు.

” ఈ క్రీడలో శారీరక శ్రమ దానితో బాటు వ్యూహాత్మక ఆలోచనల మధ్య అద్భుతమైన సమతుల్యత కనిపిస్తుంటుంది” అన్నారాయన. మహిళల జట్టుకు చెందిన కరోలినా మాట్లాడుతూ, “మేము ఖో ఖోకి కొత్తగా వచ్చినప్పటికీ, మా శక్తి అపరిమితంగా ఉంది. ఇతర జట్లను, ముఖ్యంగా భారతదేశం జట్టును చూడటం సంతోషంగా ఉంది. గత కొన్ని నెలల శిక్షణ మా వ్యూహాత్మక అవగాహనను మెరుగుపరిచింది” అని చెప్పింది. “మేము ఈ టోర్నమెంట్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాము” అని దక్షిణాఫ్రికా మహిళల జట్టు కోచ్ మట్షిడిసో చెప్పారు.

టోర్నీలో భారత్‌కు దక్షిణాఫ్రికా గట్టిపోటీని ఇవ్వనుంది. ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ మాట్లాడుతూ “ఈ టోర్నమెంట్ లో 23 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషం కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, మన దేశీయ క్రీడను ఆదరిస్తూ ప్రతి ఒక్కరూ తమ జాతీయ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఖో ఖో  అంతర్జాతీయ క్రీడగా రూపొందబోతున్నది” అని అన్నారు. ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎం ఎస్ త్యాగి సన్నాహక అంశాలను వివరించారు.

ఖో ఖో ప్రపంచ కప్ 2025 ప్రారంభ వేడుక జనవరి 13న ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత భారత్ మరియు నేపాల్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ 1 HD మరియు స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్‌లో ప్రసారం చేస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్రసార భాగస్వామిగా చేరి, డిజిటల్ స్ట్రీమింగ్ యాక్సెస్‌ని అందిస్తాయి.

Related posts

నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ

Satyam NEWS

కరోనా ఫియర్: గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు

Satyam NEWS

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఆగిపోయిన ప‌నులు స్టార్ట్ చెయ్యండి సార్లూ…!

Satyam NEWS

Leave a Comment