27.3 C
Hyderabad
August 5, 2021 14: 47 PM
Slider మహబూబ్ నగర్

కోవిడ్ 19 సహాయానికి చిన్నారుల పెద్ద మనసు

kids donation

కరోనా వల్ల నిరుపేదలు, అనాథలు పడుతున్న ఇబ్బందులను టీవీల్లో చూశారు. వారికి సాయం చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా కొన్నేళ్లుగా  దాచుకున్న పాకెట్‌ మనీ 5000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ కు అందజేశారు.

పాలెం గ్రామానికి చెందిన నగర్ కర్నూల్ పట్టణంలో కాకతీయ  పాఠశాలలో6వ తరగతి చదువుతున్న షఫీ పాషా, యూకేజీ చదువుతున్న సోహెల్ పాషా రెండు సంవత్సరాల నుంచి హుండీలో దాచుకున్న పాకెట్‌ మనీని శుక్రవారం కలెక్టర్ శ్రీధర్ కు, తండ్రి షాహిద్ పాషాతో కలిసి చిన్నారులు అందజేశారు.

రెండు ఏళ్లుగా హుండీల్లో దాచుకున్న 5000 రూపాయల డబ్బును కోవిడ్ 19 సహకారానికి ఇచ్చారు. దీంతో ఆ చిన్నారులను  కలెక్టర్ శ్రీధర్ తో పాటు పలువురు అధికారులు అభినందించారు.

Related posts

ప్రజల మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేద్దాం

Satyam NEWS

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

ఫ్యామిలీ క్రైమ్: కాపురాన్ని సరిదిద్దుకోలేక కటకటాల పాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!