అధికారులపై బెదిరింపు చర్యలకు పాల్పడితే కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ లేఖ పై రాష్ట్ర సీఎస్ నీలం సహానీ తో హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని మంత్రి వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ లేఖపై రాష్ట్ర సీఎస్ తో మాట్లాడి రక్షణ ఇవ్వాలని చెప్పామని ఆయన అన్నారు.
ఏ అధికారులను అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల వారు బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. వీలైతే ఇవాళ లిఖితపూర్వక ఆదేశాలు రాష్ట్రానికి ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో రక్షణలోనే ఉన్నారని, ఏపీ వెళ్తే పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా సీఎస్ కు చెప్పామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.