మీ ప్రేమ మండిపోనూ, అది మాకు చూపించాలా అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు పునర్నవి రాహుల్ కు కిస్ ఇవ్వడంపైనే నేడు చర్చ జరుగుతున్నది. ఈ సీన్‌పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాహుల్ ఇంత వరకు ఏ టాస్క్‌లోనూ సరిగా ఆడలేదని ఇంటాబయట అందరూ కామెంట్లు చేసేవారు. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రాహుల్‌పై పునర్నవి కామెంట్లు చేసింది. వితికాను ఎత్తుకుని పరిగెత్తే విషయమై.. వారంతా చర్చించుకుంటూ ఉంటే.. చేయి నొప్పి, కాలు నొప్పి అంటావ్ టాస్క్ నీకవసరమా? అంటూ రాహుల్‌నుద్దేశించి పునర్నవి అన్నది. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. వీకెండ్ ఎపిసోడ్‌లో ఇది ఇంకాస్త పెరిగింది. ఇక ఫ్రెండ్‌షిప్ బ్రేకప్ అంటూ పునర్నవి చెప్పేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దర్నీ కలిపేందుకు అలాంటి టాస్క్ ఇచ్చాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తన కోసం ఇరవై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగగలడా? అని అనుమానం వ్యక్తం చేసిన పునర్నవికి.. విజయవంతంగా తాగి చూపించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ టాస్క్‌ను రాహుల్ పూర్తి చేయడంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్ చేసుకుని, ముద్దు పెట్టింది. ఇక ఇదే నెటిజన్ల దొరికిన పాయింట్. పునర్నవి ముద్దు పెట్టిన సీన్‌పై సోషల్‌మీడియాలో వందలకొద్ది మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తానికి నిన్నటి ఆ టాస్క్, ఆ సీన్‌తో రాహుల్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. బిగ్ బాస్ కూడా ఫుటేజీ కోసం ఇదే కోరుకున్నది. దాంతో బిగ్ బాస్ కూడా హ్యాపీ. అయితే దీనిపై పునర్నవి ఫ్యాన్స్ కాస్త అసహనానికి లోనైట్టు కనిపిస్తోంది.
previous post