22.2 C
Hyderabad
December 10, 2024 11: 47 AM
Slider గుంటూరు

ఈ నెల 30న కే ఎల్  యూనివర్సిటీ స్నాతకోత్సవం

#kluniversity

కే ఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్శిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి. పార్ధ సారధివర్మ తెలిపారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  కెఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవం కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ కోవింద్ ముఖ్య అతిధిగా పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని, రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ లు వంటి పలువురు ప్రముఖులు గౌరవ అతిధులుగా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.

దీంతో కెఎల్ యూనివర్సిటీ లో జరగనున్న స్నాతకోత్సవం వేడుకలకు ప్రత్యేకత సంతరించుకుందని ఆయన అన్నారు. దేశంలోనే అత్యున్నత అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగి ఎ ప్లస్ సర్టిపికేట్ ఉన్న తమ వర్సిటీ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్దులు దేశ విదేశాల్లో రు.57 లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు సాదించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలో 2024 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 4 వేల 7వందల 6 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియచేశారు. ఇందులో 166 మంది పి. హెచ్. డి, 604 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 3 వేల 9వందల 36 మంది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 42 మంది విద్యార్థులకు బంగారు, 37 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు ఆయన చెప్పారు. తమ విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ఆయా విబాగాలలో సుమారు 170కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. అందుకుగాను యుజిసి నుండి కెఎల్ యు కు వంద కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించబడినట్లు పేర్కొన్నారు. తమ వర్సిటీ లో 1200 మంది అత్యంత నిపుణులైన అద్యాపకులు ఉండగా వారిలో 600 మంది వివిద విబాగాలలో డాక్టరేట్ లు సాదించినవారే కావడం విశేషమన్నారు. 

స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాత కర్త, వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు తెలియచేశారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 30 వ తేదీ ఉదయం 9 గంటల కల్లా యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి యూనివర్శిటీ అధ్యక్షులు కోనేరు సత్యన్నారాయణ అధ్యక్షత వహిస్తుండగా, వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు సంధాత కర్తగా ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ వైస్  చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ,రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎం.హెచ్ఎస్, అంతర్జాతీయ సంభందాల డీన్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోము వీర్రాజుకు రెండు నెలల పరీక్షా కాలం

Satyam NEWS

డ్రామాలతో గెలిచిన మనం వచ్చే ఎన్నికలలో ఏం చేస్తాం?

Satyam NEWS

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment