30.7 C
Hyderabad
April 23, 2024 23: 40 PM
Slider కృష్ణ

ప్లేస్‌మెంట్‌ ఆఫర్ల లో రికార్డు సృష్టించిన కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ

#kluniversity

దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ మరోమారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ పరంగా తమ ఆధిక్యతను చూపింది. ఆర్ధిక పరంగా అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ , సుప్రసిద్ధ సంస్థలు యూనివర్శిటీలోని ప్రతిభావంతులను నియమించుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. ఆగస్టు 2021నెలలో 14 రోజుల పాటు జరిగిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 212 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు లభించాయి. ఎనలాగ్‌ డివైజెస్‌ అత్యధిక పే ప్యాకేజీ సంవత్సరానికి 20 లక్షల రూపాయలను ఆఫర్‌ చేస్తే, డెలాయిట్‌ సంస్థ గరిష్టంగా 104మందికి ఉద్యోగావకాశాలను అందించింది.

సుప్రసిద్ధ జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు, యూనివర్శిటీ విద్యార్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో పాటుగా తమ డ్రీమ్‌, సూపర్‌ డ్రీమ్‌ కంపెనీలలో  ఉద్యోగాలనూ అందించాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్న సుప్రసిద్ధ కంపెనీలలో అమెజాన్‌, డెలాయిట్‌ , మోటరోలా సొల్యూషన్స్‌, హ్యాక్‌వితిన్ఫీ, ఎనలాగ్‌ డివైజెస్‌, అడోబ్‌ ఇండియా (ఇంటర్న్‌ ఆఫర్‌), జోష్‌ టెక్నాలజీస్‌ ; మెంటార్‌ గ్రాఫిక్స్‌, ఇన్ఫార్మిటికా ; ఏజిల్‌ సొల్యూషన్స్‌, మెట్రిక్‌ స్ట్రీమ్‌, సీడీకె గ్లోబల్‌, ఎకోలైట్‌ డిజిటల్‌, కోషెంట్‌ టెక్నాలజీస్‌, ప్రొవిడెన్స్‌ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌, టెక్‌ సిస్టమ్స్‌, యుఎస్‌ఐ ఉన్నాయి. యూనివర్శిటీ నుంచి విద్యార్థులను ఉద్యోగాలలోకి తీసుకునేందుకు ఈ సంస్థలు వర్ట్యువల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించాయి.

‘‘కోవిడ్‌–19 పలు సవాళ్లను విసిరినప్పటికీ, మా విద్యార్థులు పలు సుప్రసిద్ధ కంపెనీల నుంచి ప్రీ–ప్లేస్‌మెంట్‌ ఆఫర్లను పొందారు.  మా విద్య, నైపుణ్య శిక్షణ నాణ్యతకు ప్రతీకగా ఇది నిలుస్తుంది.  విద్యార్థులు విజయం సాధించడంలో తగిన మార్గనిర్ధేశనం చేసిన మా హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్స్‌, ఫ్యాకల్టీ, సిబ్బంది ప్రయత్నాలను అభినందిస్తున్నాం. 2021–22 ప్లేస్‌మెంట్‌ సీజన్‌  ప్రారంభంలో ఇది ప్రోత్సాహకరంగా ఉంది. ప్రస్తుత సీజన్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ను రెండు వారాల పాటు నిర్వహించడం ద్వారా 210 మందికి పైగా విద్యార్థులు  సుప్రసిద్ధ కంపెనీలలో  ఉద్యోగావకాశాలను పొందారు’’ అని కెఎల్‌ డీమ్డ్‌–టు–బి–యూనివర్శిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా కె ఎల్‌ డీమ్డ్‌–టు–బి–యూనివర్శిటీ ఇన్‌ చార్జ్‌ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పి. సారధి వర్మ మాట్లాడుతూ ‘‘ ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా  విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 18 సుప్రసిద్ధ కంపెనీలు  ముందుకు రావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా ప్లేస్‌మెంట్‌ సెల్‌ సంవత్సరమంతా  పనిచేయడంతో పాటుగా గ్రాడ్యుయేట్లు కంపెనీల నడుమ సంప్రదింపులు జరిగేలా  చూస్తుంటుంది. మా క్యాంపస్‌ ఇంటర్వ్యూలు/ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు పొందుతుండటం స్థిరంగా పెరుగుతుంది. విద్యార్థులు సిద్ధమయ్యేందుకు, శిక్షణా సదస్సులను సైతం నిర్వహిస్తున్నాం. తద్వారా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పొందేలా,  విప్లవాత్మక సాంకేతికతల పట్ల విషయపరిజ్ఞానం మెరుగుపరుచుకునేలా శిక్షణ అందిస్తున్నాం. ఈ కారణం చేతనే విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు పొందగలుగుతున్నారు’’ అని అన్నారు.

శిక్షణ అభివృద్ధి విభాగం, విద్యార్థులకు వెర్బల్‌, క్వాంట్‌, అప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అంశాలలో శిక్షణ అందించడంతో పాటుగా సీ, సీ++, పైథాన్‌, జావా వంటి ప్రోగ్రామ్స్‌లో శిక్షణను సైతం అందిస్తుంది. వీటితో పాటుగా యూనివర్శిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం  సేల్స్‌ఫోర్స్‌, సర్వీస్‌ నౌ, పెగా,  ఆటోమేషన్‌ ఏనీవేర్‌, టెస్సాల్వ్‌, బైట్‌  ఎక్స్‌ఎల్‌, హువే, ఎన్‌ఐ, సిస్కో, ఏడబ్ల్యుఎస్‌ మరియు మైక్రోసాఫ్ట్‌ అజూర్‌పై ఇండస్ట్రీ స్కిల్‌ సర్టిఫికేషన్‌, నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుంది. కేవలం 14 రోజుల లోపుగానే నలుగురు విద్యార్థులు సంవత్సరానికి 20లక్షల రూపాయల ఆఫర్‌లను అందుకుంటే, 18 మంది విద్యార్థులు సంవత్సరానికి 15 లక్షల రూపాయల ఆఫర్‌లను, 44 మంది విద్యార్థులు సంవత్సరానికి 12 లక్షల రూపాయల ఆఫర్‌లను,  170 మంది విద్యార్థులు సంవత్సరానికి 7.5 లక్షల రూపాయల ఆఫర్‌లను అందుకున్నారు 212 మంది విద్యార్థులు సంవత్సరానికి 5లక్షల రూపాయల జీతం ఆఫర్‌ను అందుకున్నారు.

Related posts

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందచేస్తాం

Bhavani

న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌య మూత

Bhavani

సైరా చిత్రం విడుదలను అడ్డుకోలేం

Satyam NEWS

Leave a Comment