37.2 C
Hyderabad
April 19, 2024 11: 59 AM
Slider ప్రత్యేకం

Know your right: సెక్షన్ 211 గూర్చి మీకు తెలుసా

#contempt of court

సగటు మనిషి చెయ్యని తప్పుకు పోలీస్ వ్యవస్థ శిక్ష వేస్తే మరి తప్పు చేసిన పోలీసు వ్యవస్థను ప్రశ్నించే నాధుడే లేడా? ఎన్నో ఏళ్లుగా సగటు మనిషి ఇ అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం లేక జీవితంలో రాజీ పడుతున్నాడు.

సగటు జీవికి కొండంత బలం  ఐ పి సి సెక్షన్ 211 అనేది. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఈ సెక్షన్. సగటు మనిషిని తప్పుడు కేసులో ఇరికిస్తే పడే బాధ ఏమీ చేయలేని నిస్సహాయత మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. బహుశా ఈ సెక్షన్ఉన్నట్లు కొందరికి మాత్రమే తెలుసు

చాలావరకు తెలవకుండా మన పాలకులు చేశారు. ఈ సెక్షన్లో ఓ వ్యక్తిపై అక్రమంగా నేరారోపణ చేయటం అమాయక ప్రజల్ని పొలిటికల్ ఒత్తిడితోనో ఇతర కక్ష సాధింపుతోనో, పలుకుబడి కలిగిన వ్యక్తులు పోలీసులతో సత్సంబంధాలు ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన అధికారులకు, అబద్ధపు సాక్ష్యాలతో సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించిన వారికి ని శిక్ష వేసేందుకు ఇండియన్ పీనల్ కోర్టులో ఈ చట్టం రూపొందించారు.

ఓ వ్యక్తిపై అన్యాయంగా కేసు పెట్టారని తేలితే తిరిగి ఆ వ్యక్తి పోలీసులపై కేసు పెడితే రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు  కేసు తీవ్రతను బట్టి అధికారులకు శిక్ష పడుతుంది. అంతేగాక పరువు పోయిందని నష్టపరిహారం కింద కూడా ఈ చట్టం వర్తిస్తుంది. బలహీనమైన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేశారని మెజిస్ట్రేట్ దృష్టికి వస్తే సంబంధిత పోలీసు అధికారులపైన కేసు నమోదు చేసి  విచారణ చేయమని ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు.

గతంలో కరీంనగర్ కలెక్టర్ గా పనిచేసిన స్మితాసబర్వాల్ ప్రైవేటు ఆసుపత్రి యజమాని పై కేసు నమోదు చేయగా, కోర్టులో కేసు కొట్టివేయబడింది. కాగా ఆ వ్యక్తి డిఫేమేషన్  సూట్ ఫైల్   ఐదు కోట్ల రూపాయలకు నమోదు చేయించారు. నిందితులా, ప్రభుత్వం చెల్లిస్తుందా అనేది తదుపరి విచారణలో తేలనుంది.

ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ధనార్జనే ధ్యేయంగా, పదవుల వ్యామోహంతో రాజకీయ పీఠ మెక్కిన నాయకులకు ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించే వారికి చెంపపెట్టు అనే చెప్పాలి ఈ చట్టం.

పీ శ్రీధర్, కల్వకుర్తి సత్యం న్యూస్ రిపోర్టర్

Related posts

ఏపీ సీఎం జగన్ ని దూషించిన ఏ ఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

Bhavani

ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం

Satyam NEWS

ఒక్కరోజులో 10వేలు దాటిన కరోనా కేసులు

Bhavani

Leave a Comment