37.2 C
Hyderabad
March 29, 2024 21: 06 PM
Slider నల్గొండ

అంగవైకల్యంతో ఉన్న పాపకు ఎమ్మెల్యే సాయం

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా కోదాడ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కోదాడ శాసన సభ్యుడు  బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేశారు. అనంతరం హరిత హారంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. అనంతరం బాలాజీ నగర్ కు చెందిన మహమ్మద్ హబీబా తరణం అనే 5 సంవత్సరాల పాప కు ఆర్ధిక సాయం అందించారు.

పుట్టుకతో మూగ, చెవిటి సమస్యతో ఆ పాప బాధపడుతున్నది. ఆ పేద కుటుంబంలో ఆనందాన్ని నింపేందుకు  కె టి ఆర్  పిలుపు మేరకు తన జీతభత్యాల నుండి వైద్య ఖర్చులకు కావలసిన   5 లక్షల రూపాయలు  విరాళంగా శాసన సభ్యుడు  బొల్లం మల్లయ్య యాదవ్ అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా

Satyam NEWS

హౌసింగ్ ప్రోగ్రాం కు రెవెన్యూ పూర్తి సహకారం కావాలి

Satyam NEWS

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

Leave a Comment