Slider కృష్ణ

మూడు ఛానెళ్లపై నిప్పులు చెరగిన కొడాలి నాని

#kodaliNani29

రామోజీరావు దర్శకత్వంలో ఈ టీవీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఏబిఎన్, బిఆర్ నాయుడు నిర్వహించే టీవీ 5 ఛానెళ్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని దళిత వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని తీసేసిన తాసిల్దార్లు (మాజీ మంత్రులు) రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని నాని వ్యాఖ్యానించారు.

టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయించి.. జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. కొందరు టీడీపీ నేతలు విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని చెప్పారు.

టీడీపీ నేతలు కేసులు వేయడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిందని.. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.

సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకూ రూ.60 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

Related posts

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

Satyam NEWS

ప్రోటో కాల్ ఉల్లంఘన: అధికారులపై కార్పొరేటర్ దూసరి లావణ్య ఫైర్

Satyam NEWS

సీతక్కను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాo

Bhavani

Leave a Comment