ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా నేడు తెలంగాణ బంద్ విజయవంతంగా జరుగుతున్నది. బంద్ కు పిలుపునిచ్చిన నాయకులను, వారికి మద్దతు తెలుపుతున్న వారిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్ లోని జెబిఎస్ వద్ద బంద్ లో పాల్గొనడానికి వచ్చిన టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా జెబిఎస్ ముట్టడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ముఖ్య నాయకుడు రావుల చంద్రశేఖరరావులను కూడా అరెస్టు చేశారు. తెలంగాణ బంద్ కు కార్మిక సంఘాలు, క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్, డాక్టర్లు వెల్ఫేర్ అసోసియేషన్, రేషన్ డీలర్లు సంఘం, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఇతర పక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఉదయం నుండే స్వచ్చందంగా బంద్ లో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొద్దిగొప్ప నడుస్తున్న బస్సులను ప్రత్యేక ఏర్పాట్లు చేసి నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బస్సు డిపోల దగ్గర ప్రత్యేక పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
previous post