ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమాన మేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వివిధ తెలుగు న్యూస్ ఛానెళ్లు రకరకాల వార్తలు ప్రసారం చేస్తుండటంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన సమీప బంధువు కంచేటి సాయి కోడెల మరణంపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు కోడెల కుమారుడు హైదరాబాద్ లోనే లేడని కెన్యాలో ఉన్నాడని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అంటున్నారు. కోడెల శివప్రసాద్‌తో, ఆయన కొడుకు శివరాం గొడవ పడ్డారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. శివరాం కెన్యాలో ఉన్నాడని, అవసరమైతే పాస్‌పోర్టు వివరాలు చూసుకోవాలని అన్నారు. శివరామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలా కాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తన ఆస్తులను శివరామ్ పేరుమీదకు మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని ఆయన ఆవేదనను తనతో పంచుకున్నాడని సాయి అంటున్నారు.
previous post
next post