ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించింది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన మరణించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం అర్ధరాత్రి నరసరావుపేటలో తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
previous post
next post