37.2 C
Hyderabad
March 29, 2024 20: 52 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

ఎన్ని సార్లు గుండె నొప్పి వస్తుది కోడెలా?

kodela_710x400xt

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆరోగ్యం బాగా లేకపోవడం దురదృష్టకరం. పాపం అదేమిటో గానీ రాజకీయంగా వివాదం వచ్చిన ప్రతి సారీ ఆయనకు ఆరోగ్యం సరిగా ఉండదు. ఇలా ఇది మొదటి సారి కాదు. ఆయన ఇంట్లో బాంబులు పేలి ఐదుగురు మరణించిన నాటి నుంచి ప్రతి సారీ ఆయనకు గుండెల్లో నొప్పి వస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అధికంగా ఉండే గ్రామానికి వెళ్లి అక్కడ పోలింగ్ స్టేషన్ లో కి చొరబడి రిగ్గింగ్ చేస్తుండగా ఆ ఊరంతా తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఆయనకు గుండెల్లో నొప్పి వచ్చింది. ఆ గుండె నొప్పితోనే ఆయన చొక్కా చించుకుని ఎంతో బేలగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నదని టివీల వాళ్లకు చెప్పారు. మొన్నామధ్య ఆయన కొడుకును కూతురుని పోలీసులు అరెస్టు చేస్తారన్నప్పుడు కూడా పాపం కోడెల కు ఆరోగ్యం వికటించింది. ప్రజా స్వామ్యానికి ప్రమాదం వాటిల్లి నప్పుడంతా ఆయనకు ఆరోగ్యం బాగుండదు. ప్రజా స్వామ్యానికి ఆయన గుండెకు ఉన్న లింకు అది. అలాంటి ప్రజాస్వామ్యం ప్రియుడికి ఇలా ఇప్పుడు మళ్లీ గుండె నొప్పి వచ్చింది. అంటే ఇప్పుడు ప్రజా స్వామ్యానికి ఏదో జరగబోతున్నదన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు పాపం కోడెల ఎంతో విలవిలలాడి పోయారు. ఇలా రాష్ట్రాన్ని విడగొడితే ఎలా అని ఆయన ఎంతో ఆవేదన చెందారు. ఆ ఆవేదనతోనే ఆయన స్పీకర్ పదవి చేపట్టారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా అసెంబ్లీని అమరావతికి తరలించాలంటే ఆయన ఎంతో ఆవేదన చెందారు. ఆయన పార్టీ లీడర్ ఎంతో కష్టపడి నిర్మించిన హైరదాబాద్ ను వదలివెళ్లడం చరిత్రలో ఒక దుర్దినంగా భావించారు ఆయన. అందుకే ఈ పాడు చరిత్రను అమరావతికి తీసుకువెళ్లాలని అనుకోలేదు. చక్కగా తెలంగాణ వాటాను వదిలేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోని 52 శాతం వాటా ఫర్నీచర్ ను తన దొడ్డిలోకి తరలించారు. ఇటాలియన్ ఫర్నీచర్, కంప్యూటర్లు ఒకటేమిటి చేతికి అందినవన్నీ ఆయన ఎంతో బాధతో తన పెరటిలోకి తరలించారు. అక్కడవాటిని జాగ్రత్తగా దాచి పెట్టారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ కి కొత్త ఫర్నీచర్ కొనేశారు. హైదరాబాద్ నుంచి తరలించిన ఫర్నీచర్ విలువ పెద్ద ఎక్కువే కాదు కోటి రూపాయలు ఉంటుంది. తుచ్ఛమైన కోటి రూపాయల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందా అని ఆయన గుండె ప్రశ్నిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. అప్పటిలో కోడెల రిగ్గింగ్ చేసుకుంటుంటే ఊరుకోవాలి కదా? గొడవ చేయడం ఏమిటి? తప్పు కదూ. కోడెల కొడుకు కూతురు డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ల కెందుకు కడుపు మంట. ఎంచక్కా దోచుకుతిననివ్వాలి కదా? కేసులు పెడతారా? ఎంత అన్యాయం? ప్రజా స్వామ్యం ఏం కావాలి? పోనీ అవన్నీ వదిలేయండి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నఫర్నీచర్ ను ఎంతో ప్రేమగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం ఆయన ఇంట్లో పెట్టుకుంటే ట్రాక్టర్లు, ట్రాలీలు తెచ్చి గొడవలు చేస్తారా? ఎంత దారుణం? ప్రజాస్వామ్యాన్ని ఇంత అపహాస్యం చేస్తారా? అందుకే ఆయన గుండె తట్టుకోలేకపోయింది. వెళ్లి ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గంట గంటకు హెల్త్ బులిటెన్  లు విడుదల చేస్తున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న తెలుగుదేశం పార్టీ అశేష కార్యకర్తల కోసం. ఇంతకీ ఆ ఆసుపత్రి ఎవరిదో చెప్పలేదు కదూ అది ఆయన కుమార్తెదే. వేరే ఆసుపత్రి అయితే ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్తితి బయటకు తెలుస్తుంది కదా. అందుకే గుంభనంగా ఉండి ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు. లక్ష్మీ ఆసుపత్రిలో చికిత్స ఎలా జరుగుతుందోనని ఆయన అభిమానులమైన మేము ఆందోళన చెందుతున్నాము. అందుకోసం ఆయనను గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆయనకు ట్రీట్ మెంట్ అన్నా ఇప్పించండి లేదా ఫర్నీచర్ అన్నా వదిలేయండి. కోటి రూపాయల ఫర్నీచర్ మీకు ఒక లెక్కా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీరు ఫర్నీచర్ వదిలేయండి. కోడెల క్యాంపు కార్యాలయం కొనసాగించాలి. మాజీ స్పీకర్ కు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని ఎవరైనా చెబితే కొడెలకు నమ్మకం కలగడం లేదు. మాజీ స్పీకర్ కు ప్రోటోకాల్ ప్రకారం సర్వాధికారాలు ఉంటాయని ఆయన అనుకుంటున్నారు. అలానే ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. మాజీ స్పీకర్ ను, మాజీ సిఎం ను చట్టానికి అతీతులుగా ప్రకటించాలి.  కృష్ణానది ఒడ్డున సిబి నాయుడి ప్రజావేదిక కూలగొడితిరి, కోడెల దాచుకున్న ప్రభుత్వ ఫర్నీచర్ ను తీసుకుపోతుంటిరి? ఎంత అన్యాయం?

Related posts

జాతీయ మానవ హక్కుల-నేర నిరోధక సంఘం

Satyam NEWS

వరి పంటకు వస్తున్న తెగుళ్లపై రైతుల ఆందోళన

Satyam NEWS

రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment