ఇటీవల తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కోర్టులో లొంగిపోయారు. నరసరావుపేట ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన ఇవాళ హాజరయ్యారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడెల శివరామ్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎందరినో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఎంతో మంది బాధితులు ముందుకు వచ్చి ఆయనపై కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి కోడెల శివరామ్ ను అరెస్టు చేస్తారని చాలా కాలంగా వినిపిస్తున్నది
previous post