ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మెడ చుట్టూ తాడు గుర్తులు ఉన్నట్లు పోస్టు మార్టం నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కోడెల ఆత్మహత్య కారణంగానే చనిపోయినట్టు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రి లో నలుగుగురు డాక్టర్ల బృందం ఈ పోస్టుమార్టం నిర్వహించింది. కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతి పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తెలిపారు. మొత్తం మూడు టీమ్ లతో దర్యాప్తు జరువుతున్నామని, బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ లు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నాయని ఆయన తెలిపారు.
previous post