33.2 C
Hyderabad
April 26, 2024 00: 56 AM
Slider మహబూబ్ నగర్

భారీ వర్షాలకు జాగ్రత్తలు తీసుకోవాలని కొల్లాపూర్ సిఐ వినతి

#Kollapur CI

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కృష్ణా నది, చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని కొల్లాపూర్ పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి సూచించారు.

ముఖ్యంగా చేపలవేటకి వెళ్ళరాదని, ప్రయణాలను వాయిదా వేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ముక్కిడిగుండం వాగు , బావాయిపల్లి దగ్గర కాల్వ, ఉదృతంగా ప్రవహిస్తుంది. అక్కడి రోడ్డు ను మూసివేశామని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

వర్షాలు అధికంగా కురుస్తున్నందున గ్రామాలలో ఉన్న విద్యుత్ స్తంభాలు గాని, ఎలక్ట్రిక్ సదుపాయం ఉన్న ఎలాంటి వాటి వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని సిఐ కోరారు. అదేవిధంగా చిన్న పిల్లలను అడుకోవడానికి బయటకు పంపకుండా, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో ఉన్న పాడుబడ్డ పాత ఇండ్ల వద్దకు ఎవరు వెళ్లకూడదని సిఐ తెలిపారు. అలాంటి ఇండ్లు ఏమైనా ఉంటే వెంటనే స్థానిక గ్రామ పోలీసు అధికారికి గాని, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

ఎలాంటి సమస్య ఉన్న డయల్ 100 కు గాని, ఈ కింది నంబర్లకు గాని సమాచారం ఇవ్వవచ్చునని ఆయన వెల్లడించారు.

1.కొల్లాపూర్   సిఐ-9440795725

2.కొల్లాపూర్ ఎస్ఐ-9440795711

3.పెంట్లవెల్లి ఎస్ఐ-7901099465

4.పెద్దకొత్తపల్లి   ఎస్ఐ-9440900915

 5.కోడేరు ఎస్ఐ – 9440900914

Related posts

రాష్ట్రపతిపై మంత్రి వ్యాఖ్యలకు మమత క్షమాపణ

Satyam NEWS

కరోనా వ్యాక్సిన్ వచ్చినందుకు మోకాళ్లపై మెట్లపూజ

Satyam NEWS

సీఎం కేసీఆర్ తాయిలాలూ.. ఎన్నిక‌ల మేనిఫేస్టో విడుద‌ల‌

Sub Editor

Leave a Comment