మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కి బెయిల్ మంజూరు అయ్యి విడుదల కావడంతో కొల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షులు పరశురాము నాయుడు ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా లో సంబరాలు నిర్వహించారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు ముస్తఫా, రఫీ, మహమ్మద్లు బాణసంచా కాల్చారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ దొర పాలనలో ప్రశ్నించినవారిని జైలుకు పంపించే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. అన్ని మీడియా ఛానల్స్ దొరల చేతుల్లో బందీ అయ్యాయని ఆయన అన్నారు. రేవంత్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు అని ఆరోపించారు. రేవంత్ తన అసలు రూపాన్ని చూపించే సమయం వచ్చిందని, దానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు మద్దతు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, క్రాంతి తదితరులు కూడా పాల్గొన్నారు.