23.2 C
Hyderabad
September 27, 2023 21: 36 PM
Slider తెలంగాణ

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి చిత్తశుద్ధి లేదు

kollapur raythu

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన స్వలాభం కోసం పార్టీ మారి టిఆర్ఎస్ లో చేరాడని కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ అన్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గ రైతులను రోడ్డు మీదకి తీసుకువచ్చారని రాము యాదవ్ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించడం పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడని ఆయన విమర్శించారు. సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే వైఖరిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేరుశెనగ విత్తనాల కొరతపై కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో మెయిన్ రోడ్ పై ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సొంత  నియోజకవర్గానికి న్యాయం చేయలేక పోతున్నారన్నారు. వనపర్తిలో లేని కొరత కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నిర్లక్ష్యమే  కారణమన్నారు. నిజంగా వ్యవసాయ శాఖ మంత్రికి, ఎమ్మెల్యే కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయవలసిన  ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అధికార పార్టీలోకి వెళ్లి రైతులపై నిలర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. రైతులు రాత్రి పగలు తేడా లేకుండా తెల్లవారుజాము వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఉండవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు చనిపోతే మంత్రి సింగిరెడ్డి సిగ్గుపడే మాటలు మాట్లాడుతున్నారన్నారు. రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాము యాదవ్, రంగినేని జగదీశ్వర్ అన్నారు. ఎసై కొంపల్లి మురళి గౌడ్ రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పారు. అగ్రికల్చర్ అధికారి నాగరాజు విత్తనాల సరఫరాపై  హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు పరుశరామ్, మైనార్టీ సెల్ నాయకులు ముస్తఫా, మోజర్ల గోపాల్, శీలం వెంకటేష్, ప్రజా సంఘాల నాయకులు  పుట్ట పాగా రాము ,క్రాంతి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు రాఘవాచారి మృతి

Satyam NEWS

కరోనాతో తమిళనాడులో తొలి ప్రజాప్రతినిధి మృతి

Satyam NEWS

సమష్టిగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!