కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో నియోజవర్గానికి చెందిన బాధితులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ ఓసిలను అందజేశారు. పాన్ గల్, కోడేర్, కొల్లాపూర్ మండలాలకు చెందిన ప్రజలు కొందరు అనారోగ్యంతో బాధపడుతూ, మెరుగైన వైద్యం పొందే ఆర్థిక స్థోమత లేక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే ఆయన స్పందించారు. కోడేరు మండలం బాడిగే దిన్నే గ్రామానికి చెందిన బి.గౌతమ్ తండ్రి వీరస్వామికి మూడు లక్షలు, పాన్ గల్ మండలం రేమోద్ధుల గ్రామానికి చెందిన ఎం.తిక్కన తండ్రి నరసింహ్మకు రెండు లక్షలు, కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన ఎం.సరస్వతి భర్త సురేందర్ రెడ్డిలకు రెండు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓసీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .ప్రజలు ఆ ధైర్య పడవద్దన్నారు. మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ ఫండ్ అండగా ఉందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటానని ఆయన తెలిపారు. నియోజక వర్గ ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు
previous post
next post