ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నదని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మరీ ముఖ్యంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని ఆయన తెలిపారు. కొల్లాపూర్ మండలం యన్మన్ బెట్ల గ్రామానికి చెందిన ఎస్. రమేష్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన సీఎం రిలీఫ్ పండు 1,00,000 (లక్ష రూపాయల)చెక్కు ను ఆయన నేడు అందచేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన కొద్ది సేపు మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన చెప్పారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
previous post