అనారోగ్యంతో బాధ పడుతున్న ఒక మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష రూపాయలు మంజూరయ్యాయి.
కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన M.బాలమ్మ అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించారు.
నేడు ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఎల్వోసిని అందచేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యేకు కృష్ణయ్య కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు.