31.7 C
Hyderabad
April 24, 2024 23: 48 PM
Slider మహబూబ్ నగర్

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఎమ్మెల్యే భీరం ఆర్థిక సహాయం

#kollapurmla

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని  పేదింటి ఆడ బిడ్డ పెళ్లికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. పట్టణ కేంద్రంలోని ఆరోవ వార్డు కు చెందిన కృష్ణమాచారి (టైలర్) కుమార్తె  వివాహానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 25000 వేల రూపాయల నగదును పెళ్ళి ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని పంపించారు.

ఈ నగదును సింగిల్ విండో చైర్మన్ పెబ్బిటి కృష్ణయ్య,మార్కెట్ యార్డ్ చైర్మన్ జీ.నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్ర,  టిఆర్ఎస్ నాయకులు చంద్ర శేఖర చారి,జాఫర్, కో ఆప్షన్ నెంబర్ రుక్కు ముఖ్య అనుచరులు  హరికృష్ణ, సాయిరాం యాదవ్ తదితరులు బుధవారం పెళ్లి పందిరి లో కృష్ణమాచారి కి అందజేశారు.

Related posts

అన్ని చోట్లా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు

Satyam NEWS

కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం

Bhavani

3వ తేదీ నిరసనలు జయప్రదం చేయాలని కరపత్రం

Satyam NEWS

Leave a Comment