35.2 C
Hyderabad
April 24, 2024 14: 36 PM
Slider మహబూబ్ నగర్

మునిసిపల్ ఎన్నికల బీ ఫారాలు అందుకున్న బీరం

beeram harsha

మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికలో పైచేయి సాధించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారాలు అందుకున్నారు. తెలంగాణా భవన్ లో జరిగిన TRS పార్టీ ఎమ్మెల్యేల  సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ లను TRS పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

అందుకోసం టిఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు బాధ్యులైన ఎమ్మెల్యేలకు బీ ఫారాలను ముఖ్యమంత్రి అందచేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు చెందిన A ఫార్మ్స్- B ఫార్మ్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందుకున్నారు.

Related posts

జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం

Satyam NEWS

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

Satyam NEWS

కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి చౌరాసియా పై దాడి

Satyam NEWS

Leave a Comment