24.7 C
Hyderabad
March 29, 2024 06: 27 AM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరుల నేరాలు…ఘోరాలు…బేరాలు

#BJYM

బీజేపీ యువ మోర్చా నాయకులు మెంటే శివ కృష్ణ ఆరోపణ

కొల్లాపూర్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరుల నేరాలు- ఘోరాలు, బేరాలు, ఎక్కడ ప్లాట్లు ఖాళీగా కనిపిస్తే కబ్జాలు చేయడం ఎక్కువ అయిపోయాయని బీజేపీ యువ మోర్చా నాయకులు మెంటే శివ కృష్ణ అన్నారు. కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ పరిధిలో సర్వే నెంబర్ 104 లో ప్లాట్లు కొన్న బాధితులను మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ భర్త ఖాదర్ పాషా పోలీస్ లతో  బెదిరింపులు చేస్తూ, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బాధితులైన ఎస్సీ,ఎస్టీ మైనారిటీ బహుజనులకు అండగా బీజేపీ యువ మోర్చా ఉంటుందని ఆయన చెప్పారు.

బాధితుల ఆవేదన

భార్య భర్తలం కష్టం చేసి పైసా పైసా కూడబెట్టి కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సర్వే నెంబర్ 104లో ప్లాట్లు కొన్నాము.అయితే మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త ఖాదర్ పాషా మమ్మల్ని బలవంతం చేస్తూ భేదిరిస్తూ, పోలీస్ లతో భయభ్రాంతులకు గురిచేస్తు,ప్లాట్లు అమ్ముతే మాకే అమ్మాలి  లేదంటే వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు.

ముఫై పిట్ల రోడ్ ను ఖాబ్జా చేస్తున్నారని  గురువారం సాయంత్రం కొల్లాపూర్ లో మీడియాతో చెప్పుకున్నారు.మరి కొందరు బాధితులు హై కోర్టు ను ఆశ్రయించినట్లు చెప్పారు. ప్రోటోకాల్ లో ఉన్న వైస్ ఛైర్పర్సన్ పై, అదే విధంగా పోలీస్ లు వచ్చి భేదిరిస్తున్నారని, పోలీస్ లు రావడానికి కోర్టు అనుమతి ఇచ్చిందా అని కూడా అడుగుతున్నట్లు బాధితులు చెప్పారు.

Related posts

బూందీ పోటులో అగ్నిప్ర‌మాదాల నివారణ‌కు చ‌ర్య‌లు

Satyam NEWS

మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖలు

Satyam NEWS

బొబ్బిలి లో “ఇదేం ఖర్మ మన రాష్ఠ్రానికి” ప్రొగ్రాం

Satyam NEWS

Leave a Comment