26.7 C
Hyderabad
May 1, 2025 06: 15 AM
Slider తెలంగాణ

12 లక్షలు సీఎం ఎల్ఓసి ఇప్పించిన ఘనత జూపల్లి దే

jupallu medical

19 ఏండ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా కూడా తాము ఏ రోజూ అసత్య ప్రచారాలు చేసుకోలేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  వర్గీయులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్ లోకి వలస వచ్చిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 6 లక్షల రూపాయలకు సిఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఇప్పించి తానేదో ఘనత సాధించినట్లు చెప్పుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవసరంలో ఉన్న ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి  అత్యధికంగా మంజూరు చేయించిన ఘనత  జూపల్లి దే అని సోషల్ మీడియాలో వారు కౌంటర్ ఇస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఓడిన ఎమ్మెల్యే ఒకే పార్టీలో ఇద్దరూ ఉండడం పార్టీ ఇద్దరికి ప్రియారిటి ఇవ్వడంతో ఇద్దరు ప్రభుత్వ సంక్షేమలను పంపిణీ చేస్తున్నారు. రెండు వర్గాలు ఒకరంటే ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రచారం చేశారు. ఇది వరకు ఇలా జరిగింది. శనివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంత విపన గండ్ల  మండల కేంద్రానికి చెందింస్ ఎం.రామకృష్ణ  కవలపిల్లలకు సంబంధించిన అంశంపై ఆరు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ ఓసిని మంజూరు చేయించి పంపిణీ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆ వర్గీయులు తెలియజేశారు. ఇంతవరకు  కొల్లాపూర్ చరిత్రలోనే  ఆరు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్  పంపిణీ చేయడం మొట్టమొదటిసారి అని  కామెంట్ చేశారు. దీనికి  జూపల్లి కృష్ణారావు పంపిణీ చేసిన సంఘటనలు ఆ ఆ వర్గీయులు గుర్తు చేస్తున్నారు.  జూపల్లి మంత్రిగా ఉన్న సమయంలో బాల్ “రెడ్డి” సామాజిక వర్గానికి చెందిన బాధితుడికి 19.11.2018 తేదీన 12 లక్షల రూ. సీఎం రిలీఫ్ ఎల్ ఓసి నీ మంజూరు చేయించి బాధితుడికి ఇచ్చిన ఘనత జూపల్లి ఇచ్చారని  నిజానిజాలు తెలియచేస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకున్న ఘనత జూపల్లికి చెందిందని చెప్పుతున్నారు.ని జానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకోవడం సరికాదంటున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న సభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ చరిత్రలోనే ఎల్ ఓసి ని మంజూరు కావడం మొదటిసారని చెప్పలేదు. జూపల్లి కృష్ణరావు కూడా ఇప్పటికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ ఓసీలను పంపిణీ చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో గొడవలు రేపే వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రూప్ సభ్యులు అంటున్నారు.

Related posts

భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ కృతజ్ఞతలు

Sub Editor

ఆస్పత్రికి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తరలింపు

Satyam NEWS

భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!