27.7 C
Hyderabad
April 26, 2024 03: 30 AM
Slider మహబూబ్ నగర్

రూ.884.43 లక్షలతో కొల్లాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్

#kollapurmunicipality

మున్సిపాలిటీ లో నెలకొన్న సమస్యలపై చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

కొల్లాపూర్  మున్సిపాలిటీ లో 2022-23 వార్షిక బడ్జెట్ కు సంబంధించిన అంచనా ఆదాయ, వ్యయాల ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సూచించారు. గురువారం నాడు కొల్లాపూర్ లోని నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు. మున్సిపాలిటీ పన్నులు వందశాతం వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 884.43 లక్షల అంచనా బడ్జెట్ ను ఆమోదించుకున్నారు.

పట్టణ అభివృద్ధి పథకాల అమలులో భాగంగా కౌన్సిల్ సభ్యులు చర్చించి తీర్మానించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నిధులలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ హరిత హారానికి కేటాయించాలని, వాటిని వంద శాతం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  వీధి దీపాలు, పారిశుధ్యం పై ప్రత్యేకంగా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులు షేక్ రహీం పాషా, మాచుపల్లి బాలస్వామి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల అమలు సక్రమంగా లదేని, వీధి దీపాలు వెలగడం లేదని, అన్ని వార్డుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సభ్యులు లేవనెత్తిన అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకునే వాటిపై రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ కు నివేదించి అమలు అయ్యేలా చూస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా సభ్యులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్  రఘుప్రోలు విజయలక్ష్మి తన ఛాంబర్ లో కలెక్టర్ కి శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆర్. విజయలక్ష్మి, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ జేత్రం నాయక్, విక్రమ్ సింహా రెడ్డి, వైస్ చైర్మన్ మహముదా బేగం, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

యూట్యూబ్ ఛానెళ్లలో రెచ్చగొట్టే ప్రసారాలపై కేసులు

Satyam NEWS

ప్రధాని మోడీ సాహస యాత్ర

Satyam NEWS

స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేసిన అల్లూ అర్జున్

Satyam NEWS

Leave a Comment