విజయదశమి సందర్భంగా పోలీస్ ఆయుధాలకు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నాడు విజయదశమి పండగ సందర్భంగా కొల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్ లో కేంద్రంలో ఎసై కొంపల్లి మురళి గౌడ్ అధ్యక్షతన సీఐ బి. వెంకట్ రెడ్డి దుర్గా మాత చిత్ర పటాలకు పూలమాలలతో ప్రత్యేక అలంకరణ చేశారు. హిందూ సంప్రదాయ పద్దతిలో పోలీస్ ఆయుధాలకు ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం సిఐ వెంకట రెడ్డి మాట్లాడారు. విజయదశమి రోజును ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడి ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీసులు ప్రజా సేవలో ఉండాలని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్లు ఆధునిక దేవాలయాలుగా మారాలని, ఎవరు సహాయం కోసం వచ్చినా పోలీసులు వారికి జాతి మత కుల వివక్ష లేకుండా సహాయం చేయాలని సీఐ పోలీసు సిబ్బందికి ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విమోచన, ఏఎసై లక్ష్మయ్య, కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు
previous post