37.2 C
Hyderabad
April 19, 2024 12: 45 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

#kollapur

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేక ఉద్యమాలలో పాల్గొన్న వారి పరిస్థితి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఏ విధంగా ఉందో చూస్తూనే వున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కొందరు స్వార్థం కోసం అధికార పార్టీ లోకి వెళ్తుంటే…. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమాలు చేసిన నాయకులు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని వదిలి ప్రజల పక్షాన నిలబడుతున్న జాతీయ పార్టీల వైపు వెళుతున్నారు.

ఇది టీఆర్ఎస్ పార్టీ పతనానికి సంకేతాలనీ కొందరు విశ్లేషకులు అంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు చైతన్యంతో 2018 అసెంబ్లీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అయితే మూడు నెలలకే అభివృద్ధి కోసం అంటూ అధికార పార్టీ లోకి వలస వెళ్లారు. ఆ తర్వాత అభివృద్ధి చెందింది ఎవరు? ప్రభుత్వ ఫలాలు  ఎవరికి అందాయనేది  ప్రజలకు తెలుసు.

అందుకేనేమో ప్రస్తుతం అదే  కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది. ఇదివరకే కొల్లాపూర్ నియోజకవర్గంలో సిఆర్ జగదీశ్వర్ రావు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కి వెళ్ళారు. అంతలోనే టిఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ ఇచ్చారు. కొల్లాపూర్ సేవా సమితి చైర్మన్ రంగినేని అభిలాష్ రావు  విజయదశమి పండుగ రోజు హైదరాబద్ లో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డినీ మర్యాద పూర్వకంగా పులే బొకే ఇచ్చి కలిశారు. సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సంకేతాలు పంపారు.

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రంగినేని

గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అమెరికాలో ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కొద్ది కాలం క్రితం నుండి  కొల్లాపూర్  నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. కొద్దికాలంలోనే నియోజకవర్గంలో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. కొల్లాపూర్  సేవ సంస్థ ను ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు  చేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో కీలక పాత్ర వహిస్తున్నారు.

దిని బట్టి చూస్తే నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని తెలుస్తుంది. నియోజకవర్గంలో పతనం మొదలైందనీ అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి రాష్ట్ర  సాధనలో కీలక పాత్ర వహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు ఇక్కడ పార్టీ నుండి కాకుండా వ్యక్తిగతంగా  నియోజక వర్గంలో సొంత క్యాడర్  బలంగా వుంది. ఎమ్మెల్యే వర్గం నుండి మాత్రమే మార్పులు జరిగాయి.

అభిలాష్  రావు కాంగ్రెస్ లోకి వెళ్లుతున్నట్లు సంకేతాలు రావడంతో  ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. అధికార ఎమ్మెల్యే  వంటరి  అయ్యాడనీ మాటలు వినిపిస్తున్నాయి. అయితే గమనించాల్సింది ఏమిటంటే  మొదటి నుంచి  టిఆర్ఎస్ లో లేరు. కానీ  అందరూ అధికార  పార్టీలోకి వలస వచ్చారు.

ఆయన అనుచరులు నయీం ముఠా గ్యాంగ్ అరాచకాలకు పాల్పడుతున్నారు అంటూ బహుజనులు  ఇదివరకే నిరసనలు చేశారు. మరి ఈ విధంగా చూస్తే  అధికార పార్టీకి నియోజకవర్గంలో  పరిస్థితి ఏ విధంగా ఉందో, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి వుంది. అందులో ఉండే వారి రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అని విశ్లేషకులు అంటున్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

తెలుగు ప్రజలకు  చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS

వెంకటేష్ హీరోగా తెలుగులో ‘అసురన్’

Satyam NEWS

తిరుప‌తి లోక్‌స‌భ‌లో తెదేపాకే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌నున్నారు

Sub Editor

Leave a Comment