39.2 C
Hyderabad
April 25, 2024 18: 00 PM
Slider మహబూబ్ నగర్

ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల్లో పట్టుబడ్డ సారా

#exciseenforcement

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్  పరిధిలో భారీ ఎత్తున సారా బెల్లం పట్టుబడింది. కొల్లాపూర్  ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి మహబూబ్ నగర్ ఎన్ ఫోర్స్ మెంట్  టీం కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో తనిఖీలు చేశారు. బడిగదినే తాండా లో  5 లీటర్ల సారా సీజ్ చేశారు. 5కేజీల బెల్లం పటిక, 60 కేజీల బెల్లం సీజ్ చేశారు. 100లీటర్ల  బెల్లం పానకం నేలపాలు చేశారు.

అదేవిధంగా ఏల్లూరు గ్రామ సమీపంలో బోడబండ తండా దగ్గర బెల్లం రాజు అనే వ్యక్తి  భారీ మొత్తంలో నిల్వావుంచిన 3750 కేజీల బెల్లం, 25 కేజీల  పట్టిక పట్టుబడింది.అదే విధంగా ఒక టాటా కార్ పట్టు  బడింది. వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారిలో  ముడావత్ రాజు ( బెల్లం రాజు) ఉన్నారు. బెల్లం రాజు పై  ఇదివరకే కేసులు ఉన్నట్లు అధికారి చెప్పారు.

అయితే బెల్లం రాజును రక్షించడానికి   కొందరు అధికార  నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం.ఏది ఏమైనా సారా బెల్లం తయారు చేసే వారిపై, మత్తు పదార్థాలు వినియోగించే,విక్రయించే వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు. అందుకే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. పిడియాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తనిఖీలలో కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలుతో పాటు గణపతి రెడ్డి సిఐ, రమణయ్య సిఐ, ఎస్ ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యాయానికి న్యాయం కావాలి మిలార్డ్

Satyam NEWS

గుర్తు తెలియని వాహనం ఢీ: పసిపాప సహా ముగ్గురి మృతి

Satyam NEWS

గుజరాత్ సర్కార్ లో సమూల మార్పులు..?

Sub Editor

Leave a Comment