28.2 C
Hyderabad
March 27, 2023 12: 01 PM
Slider తెలంగాణ

ప్రభుత్వంపై నెత్తుటితో రైతుల నిరసనలు

kollapur

పోరాటాలు చేసి, ప్రాణాలర్పించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు  నెత్తుటితో నిరసనలు తెలిపే పరిస్థితివచ్చింది. అయిన ఎవరికి జాలి కలగడం లేదు. రైతులకు జీవనోపాధిగా ఉన్న భూములను కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటికే పలుమార్లు భూసేర్వేను అడ్డుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ముందుకే వెళుతున్నది తప్ప రైతుల ఆవేదన గమనించడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసర్వేలో ఈ కారణంగానే ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు భూ సర్వేను అడ్డుకున్నారు. ముందు నుండి పోలీసులు కుడికిల్ల గ్రామ రైతులను హెచ్చరిస్తూ వచ్చారు. ఒకవైపు  గ్రామ రైతులు మల్లన్న సాగర్ ప్రాజెక్టులాగే భూమి కోల్పోతున్న రైతులకు ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కుడికిల్ల గ్రామ రైతులు సమావేశంఅయ్యారు. జిల్లా అదనపు ఎస్పీ వారితో మాట్లాడుతూ శాంతియుత వాతావరణలో భూ సర్వే జరిగే విధంగా చూడాలని చెప్పారు. సమస్యను ఎమ్మెల్యే, కలెక్టర్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆనాడు జిల్లా అదనపు ఎస్పీ జోగులు తెలిపారు. కానీ ప్రభుత్వం నుండి రైతులకు న్యాయమైన ప్యాకేజీ రానందుకు కుడికిల్ల గ్రామ రైతులు సర్వేను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయి శేఖర్ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామ రైతులను, నాయకులను తెల్లవారుజాము నుండే అదుపులోకి తీసుకొని  పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లాఎస్పీ,ఏ ఎస్పి,డిఎస్పీలు రంగంలోకి దిగారు. భారీఎత్తున పోలీసులు మోహరించారు. భూసర్వేలో భూములు కోల్పోతున్న రైతులు న్యాయం జరిగే వరకు భూములు ఇవ్వమని భూసర్వే జరగకూడదని ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిళ్లతో  నిరసన తెలుపారు. గుర్రపు మధుఅనే రైతు రాయితో తలను బాదుకున్నాడు. నెత్తురు ముద్దాగా మారి పడిపోయాడు .తక్షణమే ఆసుపత్రికి తరలించారు. మహిళలుభూ సర్వేకు అడ్డుపడ్డారు. పోలీసులు ఎలాంటి మొహమాటం పడకుండా ఈడ్చుకు వెళ్లారు. ఉమ్మడి పాలమూర్ జిల్లా నుండి వచ్చిన అధికారులు సర్వేచేశారు. మొత్తంమీద రైతులు నెత్తుటితో పెట్రోల్ పోసుకొని నిరసన చేసినా పోలీసుల బందోబస్తు మధ్యలో భూసర్వేజరిగింది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంత గందరగోళం జరుగుతున్న నియోజకవర్గ ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోనే వున్నారు. అక్కడికి వెళ్ళలేదు. ఆ గ్రామ ఎంపిటిసి బిచ్చాయికి  సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకపోతామని హామీయిచ్చారు. అప్పుడు ఇప్పటి ఎమ్మెల్యే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ముందున్నారు. ఇప్పుడు రైతులపై లాఠీ విరుగుతుంటే అవైపే చూడలేదు. కెఎల్ఐ గెస్టుహౌస్ లో ఉన్న కుడికిల్ల గ్రామ రైతులను పలకరించి, వారిమధ్య ఉన్న ఎంపిటిసి ని మండల జనరల్ బాడీ సమావేశానికి తీసుకెళ్లారు. అతనికి రైతులకు ఎలాంటి సమాచారం తెలియకుండా అధికారులు ఫోన్ తీసేసుకున్నారు.

Related posts

మూసీ అంచును మూసేస్తున్న కబ్జాదారులు

Satyam NEWS

జగన్ కు మరో షాక్: కలెక్టర్ల జాబితా తిరస్కరించిన నిమ్మగడ్డ

Satyam NEWS

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!