కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు ప్రతిరోజు విన్నూత రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. గురువారం నాటికి కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆశ వర్కర్లు, సిపిఎం నాయకులు నేడు మద్దతు పలికారు. అంబేద్కర్ విగ్రహం ముందు టెంటు కింద కూర్చుని సంఘీభావం తెలిపారు. అనంతరం ర్యాలీగా బయలు దేరారు .ఎన్టీఆర్ చౌరస్తాలో కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు కెసిఆర్ కు దినకర్మ నిర్వహించారు. కార్మికులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. సీఎం కేసీఆర్ ర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ మొండివైఖరి వలన ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నారన్నారు. కెసిఆర్ ఆర్టీసీ కార్మికులను చంపుతున్నారన్నారు. కేసీఆర్ వైఖరి మార్చుకోవలన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చలన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఉడుత రామస్వామి, జగదీష్, సీపీఎం నాయకులు శివవర్మా, అశోక్ నాయక్, తారసింగ్ తో బాటు ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
previous post