కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని వరిదేల శమివృక్షం దగ్గర దుర్గామాత వెలసింది. ఆదివారం నుండి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమం అయ్యాయి. తొమ్మిది రోజులు తొమిది అవతారాలుగా దుర్గామాత దర్శనం యిస్తుంది. దేవి నవరాత్రుల సందర్భంగా మండపం నిర్వాహకులు అర్చకుల చేత వేదమంత్రాలతో దుర్గామాతను ప్రతిష్టింపచేశారు. తొమ్మిది రోజులలో భాగంగా మొదటిరోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవి దర్శనం చేసుకున్నారు. పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకున్నారు. మంగళ హారతులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి గా భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రత్యేక పూజాలు మంగళహారతులతో కొల్లాపూర్ పట్టణ కేంద్రం మార్మోగింది. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోనే నెంబర్ వన్ గా అద్భుతంగా దేవినవరాత్రుల సెట్టింగ్ చేశారు. మండపం నిర్వాహకులు మేకల కిషోర్ యాదవ్, కే.శ్రీనివాస్, పురేందర్, పరమేష్, కుమార్, వెంకటేష్, శివ, శ్రీను, రమేష్ రాథోడ్, బొమ్మరిల్లు భాస్కర్ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
previous post