శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రజలు స్వచ్చందగా తరలిరావాలని శ్రీమాన్ బ్రహ్మశ్రీ గురు స్వామి సి.వెంకటేశ్వర శర్మ పిలుపునిచ్చారు. శనివారం కొల్లాపూర్ పట్టణం కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా గురు స్వామి శ్రీ వెంకటేశ్వర శర్మ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు రత్నప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తల్లిదండ్రులు బీరం లక్ష్మారెడ్డి, బిచ్చమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన పోస్టర్ విడుదల చేశారు. అనంతరం అనంతరం గురు స్వామి వెంకటేశ్వర శర్మ మాట్లాడారు. కొల్లాపూర్ చరిత్రలో నిలిచిపోయే విధంగా పలు ప్రత్యేకతలతో అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరుగుతుందన్నారు. అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన తో కొల్లాపూర్ ప్రాంతం ఒక పుణ్యక్షేత్రం గా మారనుందన్నారు. వచ్చే నెల నవంబర్ 22శుక్రవారం ఉదయం ఉత్తర నక్షత్ర కన్యాలగ్నం శుభ పుష్కరాంశ సుముహూర్తాన 02:52గంటలకు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందన్నారు. అంతకు ముందు 19న అయ్యప్ప స్వామి ఆభరణాలు కొల్లాపూర్ పట్టణంలో పురవిధులగుండా ఊరేగింపు ఉంటుందన్నారు. 20, 21న కార్యక్రమాలు ఉంటాయన్నారు. 22న విగ్రహ ఆయప్పస్వామి ప్రతిష్టపన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్ర్మానికి ముఖ్య అతిధిలుగా రాష్ట మంత్రులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు రామ చందర్ రావ్, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లేని సుధాకర్ రావు, ఎంపిపి గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు హాజరావుతారన్నారు. ఆయప్ప స్వాములు సేవాభావంతో పనిచేయాలన్నారు. అంతకముందు రత్న ప్రభకార్ రెడ్డి, కాటం జంబులయ్య, రెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడారు. తదనంతరం బీరం లక్ష్మారెడ్డి బిచ్చమాలు సహస్ర కలశాభిషేకాన్ని ఆవిష్కరించారు. బ్రహ్మశ్రీ సి.వెంకటేశ్వర శర్మ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ శెట్టికి అందచేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘము అధ్యక్షుడు సుదర్శన్ శెట్టి, సాయిబాబా శెట్టి, శ్రీకాంత్, కృష్ణమనాయుడు, సతీష్, ప్రసాద్ నాయుడు, టిఆర్ఎస్ మండల నాయకుడు ముచ్చర్ల రాంచందర్ యాదవ్, కిషన్ నాయక్, బండల వెంకట స్వామి, శేఖర్, హరికృష్ణ, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు
previous post