27.7 C
Hyderabad
April 25, 2024 09: 39 AM
Slider నల్గొండ

ఘనంగా కోమటిరెడ్డి జన్మదిన వేడుకలు

#Komatireddy Venkatreddy MP

మాజీ మంత్రి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా నాయకులు దైదా రవీందర్  ముస్లీమ్ లకు పండ్లు, చక్కర షేమియాలను అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, ఏ వి ఎమ్ విద్యా సంస్థల అధినేత కందాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో పిసిసి కార్యదర్శి కొండేటి మల్లయ్య కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు.

జిల్లా నాయకులు పోకల దేవదాస్, కౌన్సిలర్లు జడల పూలమ్మ, రేమిడాల లింగస్వామి, జమాండ్ల జయమ్మ, గోధుమగడ్డ పద్మ, చిన్న మల్లయ్య, జలందర్ రెడ్డి, షేక్ ఇబ్రహీం తదితరులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

మాజీ జడ్పిటిసి, ప్రస్తుత కౌన్సిలర్ శేపూరి రవీందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు జడల చిన్న మల్లయ్య లు కోమటిరెడ్డి ని తన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ఎర్లీ బర్డ్ కు నెలాఖరు వరకే గడువు

Satyam NEWS

మరో సారి జంటగా వస్తున్న కాజల్, రానా

Satyam NEWS

రెవెన్యూ శాఖ అవినీతిపై ఇక కేసీఆర్ కొరడా

Satyam NEWS

Leave a Comment