తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీశ్‌తో ఆయన సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తాజాగా టీఆర్ఎస్ కీలకనేత, మంత్రి హరీశ్‌తో భేటీ కావడంతో కోమటిరెడ్డి టిఆర్ఎస్ లో చేరతారనే పుకార్లు వస్తున్నాయి. అయితే కోమటిరెడ్డి మనసులో ఏముంది? అసలు ఆయన పార్టీలోనే కొనసాగుతారా? లేకుంటే పార్టీ మారతారా? అసలేం జరుగుతోంది? భేటీ వెనుక ఆంతర్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి.
previous post