28.7 C
Hyderabad
April 20, 2024 06: 28 AM
Slider ముఖ్యంశాలు

కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితోనే ప్రభుత్వం పనిచేస్తుంది

#ministergangula

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 107వ కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ఘనంగా జరిగాయి, అంతకుముందే జలద్రుశ్యం వద్ద 15 అడుగుల కొండాలక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల, తలసాని, ఎర్రబెల్లి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్.రమణ, హండ్లూమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

జ్యోతీ ప్రజ్వలన అనంతరం ప్రారంభమైన సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జాతీయోద్ద్యమం, రెండుదశల తెలంగాణ పోరాటం, సహకరా విప్లవంలో కొండా చేసిన క్రుషికి మరొకరు సాటిరారన్నారు. ఆయన పుట్టిన గడ్డపై జన్మించడం తెలంగాణ ప్రజల అద్రుష్టం అన్నారు,

అలాంటి మహనీయుని ఇంటిని నాడు సమైక్య పాలకులు కూల్చిన చోటే నేడు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం నిజమైన నివాళి అన్నారు. ఈ ఘనతకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, విగ్రహావిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు మంత్రి గంగుల. నాడు 2013లొనే కరీంనగర్ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పిన గంగుల ఉద్యమ సమయంలో బాపూజీతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు,

96ఏళ్ల వయసులోనూ ఎముకలు కొరికే చలిలో డిల్లీలో దర్నాలో పాల్గొన్న తీరు, తొలిదశ సాయుద రైతాంగ పోరాటంలో న్యాయపోరాటం జరిపి విప్లవకారులకు అండగానిలిచిన తీరును స్మరించుకున్నారు. అదే స్పూర్తితో స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు, బాపూజీ ఆధర్శాలతో పరిపాలన చేస్తున్నారన్నారు. ఈ సమయంలో సభికులు గుర్తు చేసిన సంఘటనను తలచుకొని బావోద్వేగానికి గురయ్యారు,

మలిదశ ఉద్యమం సాగుతున్న సమయంలో అసెంబ్లీలో, గన్ పార్క్ వద్ద తెలంగాణ అనుకూల తీర్మానాన్ని సీమాంద్ర పాలకులు చింపేసి తొక్కుతుంటే ఆ చిత్తు ప్రతులను గుండెలకు హత్తుకొని జైతెలంగాణ అని నినదించామని, నేడు ఆ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. హర్టీకల్చర్ యూనివర్శిటీకీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టిన ముఖ్యమంత్రికి దన్యవాదాలు చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ కారణంగా బడుగులకు రాజ్యాధికారం సిద్ధించింది

తెలంగాణొస్తే ఏమొచ్చింది అని అడుగుతున్న వారికి నిన్న చాకలి ఐలమ్మ, నేడు కొండాలక్ష్మణ్ బాపూజీల ఘనమైన అధికారిక జయంతులే సమాదానం అన్నారు, బీసీలైన ఎల్.రమణ, చింతాప్రభాకర్, గూడూరు ప్రవీణ్ వంటి ఎందరో తెలంగాణ ముద్దుబిడ్డలు రాజ్యాధికారంలో బాగస్వాములైన విషయం కనబడడం లేదా అని ప్రశ్నించారు. నాడు 19 గురుకులాలతో అరకొర విద్యాసధుపాయాలుంటే నేడు బీసీలకు 310 విద్యాలయాలు, లక్షలాది విద్యార్థులు ఉన్నారని, ఆడబిడ్డ పెల్లికోసం అష్టకష్టాలు పడే తల్లుల కడుపుకోతను తీర్చేలా కళ్యాణలక్ష్మీ వచ్చిందని, సాగునీరు, తాగునీరు, విద్యుత్, మద్దతుదర ఇలా అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ గారి నేత్రుత్వంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఇంత చేస్తున్న ముఖ్యమంత్రిగారికి మన ఆశీర్వాదాలు అందజేయాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య, నిజాం వ్యతిరేఖ, తెలంగాణ పోరాటాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివన్నారు, గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ మహనీయున్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని నేడు కేసీఆర్ గారి సారథ్యంలో ఘనంగా జలద్రుశ్యంలో విగ్రహావిష్కరణ చేసుకొని రాష్ట్ర పండుగగా జయంతిని నిర్వహించుకుంటున్నామన్నారు.

భారత స్వర్ణోత్సవాల వేల జెండాల్ని సైతం చైనా నుండి తెచ్చిన కేంద్రప్రభుత్వం ఎక్కడా… మన నేతన్నలకు ఆత్మగౌరవంతో పాటు ఆర్తిక స్వావలంబన చేకూరుస్తూ బతుకమ్మ చీరల్ని అందిస్తున్న కేసీఆర్ ఎక్కడా అని చురకలంటించారు. ఆత్మగౌరవ భవనాలు, 24గంటల ఉచిత కరెంటు, సాగు, తాగునీరు ఇవ్వడం చాతకానోళ్లు తెలంగాణలో మొరుగుతున్నారని, వాళ్లని నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఇలాంటి విచ్చినకర దుష్టులకు అవకాశం ఇవ్వకుండా అందరూ సంఘటితంగా ఉండి కేసీఆర్ గారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎల్. రమణ, పద్మశాలీలకే కాదు యావత్ బడుగు బలహీనవర్గాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ స్పూర్తి ప్రదాతని, ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అన్నారు. ఈ ఒక్కరోజే మంత్రుల చేతుల మీదుగా ఐదు చోట్ల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు,

కేవలం తెలంగాణలో తప్ప మరెక్కడా ఇది సాద్యంకాదన్నారు. బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణ క్రుష్ణమోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణకే యావజ్జీవితం అంకితం చేసిన తొలి తరం ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని, తొలిదశ పోరాటానికి మద్దతుగా మంత్రి పదవిని త్యజించి మల్లీ స్వీకరించని ఆత్మగౌరవ పతాక అన్నారు. నాడు కాల్కేల్కర్ కమిటీ సీపార్సుల అమలు కోసం పోరాడడమే కాక, రాష్ట్రంలో అనంతరామన్ కమిటీ ఏర్పాటుకు క్రుషిచేసాడని కొనియాడారు.

చాకలి ఐలమ్మతో పాటు నాటి ఉద్యమకారులకు న్యాయపోరాటం అందించారన్నారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నేటి ఉత్సవాలకు అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొపెసర్ వెంకటరత్నంలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన సాఫల్య పురస్కారం అందజేసారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, బీసీ సంఘాల నేతలు, బీసీలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Related posts

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

ఆఖరు నిమిషంలో స్టూడెంట్స్ కు హ్యాండిచ్చిన కార్పొరేట్ కాలేజీలు

Satyam NEWS

Coal and Sand scam: ఐఏఎస్ అధికారి ఇంట్లో బంగారం, వజ్రాలు

Satyam NEWS

Leave a Comment