39.2 C
Hyderabad
March 28, 2024 14: 12 PM
Slider కరీంనగర్

పోలీసులకు చిక్కిన కొండగట్టు ఆలయం దొంగలు

#jagityalapolice

ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని 24 గంటల్లోనే నిందితులను గుర్తించగలిగారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన ముఠాను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు వెల్లి ముఠాను పట్టుకున్నాయి.

జగిత్యాల ఎస్సీ ఎగ్గిడి భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం… ఫిబ్రవరి 23వతేది అర్థరాత్రి సమయంలో కొండగట్టు అంజన్న ఆలయంలోకి చొరబడ్డ అగంతకులు రూ. 9 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయం వెనక భాగం నుండి లోపలకు వెల్లిన అగంతకులు గర్భగుడి తాళాలను పగలగొట్టి అంజన్నకు చెందిన వెండి షటారీలు, మరకతంతో పాటు వివిధ రకాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.

24 తెల్లవారు జామున దోపిడీ దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించి ముఠాను గుర్తించారు. 10 బృందాలు జగిత్యాలలో సాంకేతికతను, క్లూస్ టీమ్స్ ద్వారా ముఠా ఆనవాళ్లను గుర్తించగా 24 గంటలు తిరగకముందే బీదర్ కు 4 టీమ్స్ చేరుకోవడం గమనార్హం. నిందితుల నుండి ఒక వెండి గొడుగు. ఒక వెండి పెద్ద రామ రక్ష, రెండు ద్వారములకు గల కవచము ముక్కలు, ఒక మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సీ వెల్లడించారు.

రూ. 3.50 లక్షల విలువ చేసే వెండి వస్తువులను రికవరీ చేశామన్నారు. బీదర్ జిల్లా హులియాద్ తండాకు చెందిన బాలాజీ కేశవ్ రాథోడ్ (35), వశీరాంనాయక్ తండాకు చెందిన నర్సింగ్ జాదవ్ (23), విజయ్ కుమార్ రాథోడ్ (25)లను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో పాల్గొన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్సీ భాస్కర్ తెలిపారు. ఈ ముఠా ఒక్క కొండగట్టు అంజన్న క్షేత్రమే కాకుండా పలు ఆలయాలే లక్ష్యంగా పెట్టుకుని దోపిడీలకు పాల్పడిందని ఎస్సీ వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలోని చిలుపచేరు చాముండేశ్వరి ఆలయం, మహారాష్ట్రలోని పండరిపురం సమీపంలో కూడా దోపీడీలకు పాల్పడినట్టు తేలిందని వివరించారు. కొండగట్టు అంజన్న ఆలయంలో దోపీడీ ముఠాను పట్టుకోవడం సొత్తు రికవరి చేసిన టీంను జగిత్యాల ఎస్సీ భాస్కర్ అభినందించారు. జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్, సీఐలు రమణమూర్తి, ప్రవీణ్ కుమార్, నాగేశ్వర్ రావు, రాజు, సరిలాల్, ఎస్సైలు చిరంజీవి, సదాకర్, ఆర్ ఎస్ఐలు సుమన్, మల్లేశ్ లతో పోలీసు సిబ్బంది శ్రమించారని వారందరిని ఎస్సీ ప్రత్యేకంగా అభినందించారు.

Related posts

దత్త సంస్థలకు మేలు చేస్తున్న ప్రధాని మోడీ

Satyam NEWS

కడప జిల్లా మహిళా పోలీసుల సేవలు అభినందనీయం

Satyam NEWS

సిపిఎంతో సహా అందరూ రంగులు మార్చేశారు

Satyam NEWS

Leave a Comment