ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి బుధవారం ఆలయ అధికారులు హుండీ ఆదాయాని లెక్కించారు. గత ఏడాది నవంబర్ 27 నుండి ప్రస్తుత నెల 12 వ తేదీ 78 రోజులకి గాను 23,91,671 రూపాయిలు ఆదాయం వచ్చిందన్నారు.
ఇందులో హుండీ వరకు 22,56,025లు గా అన్నదానానికి 1,35,646 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ. ఓ అనపురెడ్డి రామకోటి రెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో సి.హెచ్ మాలికార్జున రెడ్డి సిండికేట్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.