40.2 C
Hyderabad
April 19, 2024 16: 48 PM
Slider ప్రత్యేకం

కొఠియా వివాదంలో ఒడిషాపై పైచేయి సాధించిన‌ ఏపి ప్ర‌భుత్వం

#suryakumariias

విజ‌య‌న‌గ‌రం  జిల్లా క‌లెక్ట‌రేట్  లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొనింది. అదేంటి మొన్న‌మెన్న‌నే ద‌స‌రా,అమ్మ‌వారి పండ‌గ వెళ్లిపోయింది క‌దా…ఇప్పుడుపండగేంట‌ని అనుకుంటున్నారా..? అదేకాదండీ  ఆంద్రా ఓడిషా స‌రిహ‌ద్దుల్లో  గ‌త‌కొద్ది నెల‌ల  నుంచీ గొడ‌వ‌లు జ‌రుగుతున్న సంగ‌తి విదిత‌మే. మ‌రీ ముఖ్యంగా ఆ స‌రిహ‌ద్దులో ఏపీ భూభాగ‌మైన కొఠియా ప‌రిస‌ర ప్రాంత గిరిజ‌నులు తెగ న‌లిగిపొతున్నారు.

ఇటీవ‌లే కొఠియాలోఒడిషా పోలీసులు..అక్క‌డి గిరిజ‌నుల‌ను…ఇబ్బందులు పెట్ట‌రాన్న వార్తాలు కూడా ప‌లుప‌త్రిక‌ల‌లో వ‌చ్చాయి కూడ‌. ఇటీవ‌లే జిల్లా ఎస్పీ దీపికా,ఓఎస్డీ సూర్య‌నారాయ‌ణ‌రాజు ఏఓబీకి వెళ్లారు కూడ‌.తాజగా కొఠియా నుంచీ మూడు పంచాయితీల నుంచీ  దాదాపు 55 మందిగిరిజ‌నులు వారు చూపించిన స్థాన బ‌లంతో జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి ప్ర‌త్యేక బ‌స్సులో తీసుకుని వ‌చ్చి క‌లెక్టరేట్ మెయిన్ గేట్ నుంచీ పూర్ణ‌కుంభం,మేళ‌తాళాల‌తో సాద‌ర‌స్వాగతం ప‌లికింది…జిల్లా యంత్రాంగం.

అనుకున్న స‌మ‌యానికి కాస్త ఆల‌స్యంగా అయినా…క‌లెక్ట‌రేట్ లో స్పంద‌న కార్య‌క్ర‌మం  అయిపోయినా..యావ‌త్ జిల్లా యంత్రాంగంమొత్తం గిరిపుత్రుల‌కు స్వాగతం ప‌లికింది.క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో డీఆర్వో గ‌ణ‌ప‌తిరావు….55 మంది గిరిజ‌నుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.వాళ్లంద‌రికీ క‌లెక్ట‌ర్ తోపాటు జేసీలు మ‌హేష్ కుమార్, కిషోర్ కుమార్,మ‌యూరీఅశోక్, వెంక‌ట‌రావులు శాలువ‌,పూల‌దండ‌లు స్వీట్స్ ఇచ్చారు.

ఈ సంద‌ర‌ర్బంగా వాళ్లంతా తాము ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌరులుగానే కొన‌సాగుతామంటూ తీర్మానం చేసిన కాపీని క‌లెక్ట‌ర్ సూర్య‌క‌మారికి ఇవ్వ‌గా దాన్ని జేసీ కిషోర్ కుమార్ చ‌దివి వినిపించారు. అదే మమ్మ‌ల్ని ఒడిశా ప్ర‌భుత్వం  పోలీసుల‌తో బెదిరిస్తున్నద‌ని ఆరోపించారు.. గిరిజ‌నులు.అయితే  తాము ఎలాంటి బెదిరింపుల‌కు తలొగ్గ‌బోమ‌ని, ఆంధ్రా వాసులుగానే కొన‌సాగుతామ‌ని స్పష్టం చేసారు… కొఠియా గ్రామాల ప్ర‌జ‌లు.ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్  మీడియాతో మాట్లాడుతూ. వారికి అన్నివిధాలా అండ‌దండ‌లు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Related posts

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

Satyam NEWS

అమెరికా ఆంక్షలకు చైనా ప్రతీకార చర్యలు

Satyam NEWS

భక్తిభావాన్ని పంచిన సుంద‌ర‌కాండ అఖండపారాయ‌ణం

Satyam NEWS

Leave a Comment