35.2 C
Hyderabad
April 24, 2024 12: 56 PM
Slider ముఖ్యంశాలు

కొత్తకోట సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి

#kotakotaci

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్లకు చెందిన శివ యాదవ్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డిని  సస్పెండ్ చేయాలని వనపర్తి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మోహన్ యాదవ్ (అడ్వకేట్) డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిళ్లలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితుడికి అండగా ఉండి యాదవ సంఘం మరో పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్  పట్ల కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి తీరుకు నిరసనగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బాధితుడు శివ యాదవ్ కు అఖిలపక్ష జిల్లాయాదవ సంఘం మద్దతుగా ఉంటుందన్నారు. బాధితుడు పై థర్డ్ డిగ్రీ హేయమైన చర్య అని అన్నారు.  బాధితుడి పట్ల సీఐ తీరును ఖండిస్తూ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు కొత్త గోల కృష్ణయ్య యాదవ్, వనపర్తి మాజీ జెడ్పిటిసి వెంకటయ్య యాదవ్, వనపర్తి యాదవ సంఘం టౌన్ అధ్యక్షుడు ఏర్పుల చిన్న యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిడి రాజు యాదవ్, జిల్లా యాదవ సంఘం కార్యదర్శి కొత్తకోట యుగేందర్ యాదవ్, జిల్లా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పునూరు ఆనంద్ యాదవ్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రోడ్డు ప్రమాదంలో టెలిఫోన్ జే ఈ మృతి

Satyam NEWS

రాష్ట్ర స్టాయి షార్ట్ ఫిల్మ్ పోటీల కోసం 30 వ తేది లోపు సీడీలు అందజేయాలి

Satyam NEWS

Good News: వచ్చేనెల 1 నుంచి మరిన్ని రైళ్లు

Satyam NEWS

Leave a Comment