28.2 C
Hyderabad
April 20, 2024 13: 35 PM
Slider విశాఖపట్నం

క‌రోనాతో మ‌రో పోలీసు మృతి….! అదీ ఓ ఏఎస్ఐ….!

Carona p

వ‌చ్చే ఏడాది మొద‌ట్లో అంటే జ‌న‌వ‌రిలో క‌రోనా సెకండ్ వేవ్ వ‌స్తుంద‌న్నవార్త‌లు యావ‌త్ దేశాన్ని ఆందోళ‌న‌కు గురి చే్స్తున్నాయి. అందుకు త‌గిన విధంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నివార‌ణ మార్గాలు, చ‌ర్య‌ల‌ను ఇప్ప‌టి నుంచీ అమ‌లు ప‌రిచే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ మేర‌కు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ఆదేశాల‌ను జారీ చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌. ఇదిలా ఉంటే.. ఏపీలోని క‌రోనా కేసులు సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ హాస్ప‌ట‌ల్లో చాలామంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే క‌రోనా బారిన ప‌డ్డ మృతుల సంఖ్య గణ‌నీయంగా త‌గ్గింద‌ని చెబుతోంది. సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ‌. అయితే రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖకు చెందిన ఓ వ్య‌క్తి ఇటీవ‌లే క‌రోనా సోకి చికిత్స పొందుతుండ‌గా మృతి చెందారు. జిల్లాలో తెర్లాం పోలీస్ స్టేష‌న్ లో ప‌ని చేస్తున్నఏఎస్ఐ దిండు వెంక‌ట‌కృష్ణ‌ వైజాగ్ లోని ఓ హాస్ప‌ట‌ల్ లో చేరి తాజాగా కుటుంబానికి దూర‌మ‌య్యారు. ఆ దుర్వార్త తెలిస‌న వెంట‌నే జిల్లా పోలీస్ శాఖ దిగ్ర్బాంతికి గుర‌య్యింది. స‌మాచారం అందుకున్నజిల్లా ఎస్పీ రాజ‌కుమారీ, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆ ఏఎస్ఐ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ చేసారు.

ఆ క‌రోనా కార‌ణంగా అయిదు మంది త‌మ‌, త‌మ కుటుంబాల‌కు దూర‌మవ్వ‌గా, తాజాగా తెర్లాంకు చెందిన ఏఏస్ఐ కుటుంబానికి దూర‌మ‌య్యారు. విష‌యం తెలుసుకున్నఎస్పీ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. రై… స‌ద‌రు ఏఎస్ఐ కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ చేసారు. తెల్ల‌వారుజామున త‌న‌తో ఆ అధికారి మాట్లాడార‌ని విష‌యం తెలిసిన వెంట‌నే తాను, డాక్ట‌ర్లు శ‌త విధా‌లా ప్ర‌యత్నం చేసామ‌ని త‌న‌కు తెలిపార‌న్నారు. కానీ బీపీ ఎక్కువవ‌‌డం..కార్డియాక్ స‌మ‌స్య‌తో మృతి చెందార‌ని ఎస్పీ రాజ‌కుమారీ తెలిపారు. 59 ఏళ్ల ఏఎస్ఐ ఎన‌భైశాతం ఇన్ఫెక్ష‌న్ తోనే సిక్ లీవ్ లో ఉంటూ… హాస్ప‌ట‌ల్ లో జాయ‌న్ అయ్యారని ఎస్పీ తెలిపారు.

క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డ్డ వారికి ఎస్పీ చేయూత‌..!

ఇక గ‌త ఆరు నెల‌లుగా ఏపీలోని అందునా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనాతో దాదాపు రెండు వంద‌ల ‌యాభైమందికి పై గా త‌మ‌, త‌మ కుటుంబాల‌కు దూర‌మ‌య్యారు. అలాగా సుమారు 5 వేల‌మందికిపైగా క‌రోనా మూలంగా హాస్ప‌ట‌ల్ పాలై చికిత్స పొందారు. అందులో పోలీసు శాఖ‌కు సంబంధించి వంద‌ల సంఖ్య‌లో క‌రోనా తో హాస్ప‌ట‌ల్ లో చేరి చికిత్స పొంది క్షేమంగా ఇండ్ల‌కు చేరారు. ఈ త‌రుణంలో స్వ‌త‌హాగా సేవాగుణం క‌లిగిన జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ క‌రోనా స‌మ‌యంలో ప్రాణాలు తెగించి సేవ‌లందించిన దాదాపు 2వేల‌400 మంది సిబ్బందికి స్వ‌యంగా ఓ చిరుకానుక ఇచ్చే య‌త్నం చేయ‌సాగారు. స్టేష‌న్ వారీగా సిబ్బందికి జీడిప‌ప్పు, కిస్మిస్ తో కూడిన ఓ చిన్నబాక్స్ కు బ‌హుమ‌తి పంపిణీ చేయ సాగారు. ఈ గురుత‌ర బాధ్య‌త‌ను ఏఆర్ డీఎస్పీ త‌న భుజ‌స్కందాల‌పై వేసుకుని మ‌రీ అన్ని స‌ర్కిల్ స్టేష‌న్ల సిబ్బందికి పంపిణీ చేయ‌డం ప్రారంభించారు. ఇప్ప‌టికే నీల‌కంఠాపురం, పార్వ‌తీపురం పంపించ‌గా, రోజుకో సర్కిల్ కు ఎస్పీ అందించిన బ‌హుమ‌తిని పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది ఏఆర్ డీఎస్పీ బృందం. శాఖా సిబ్బందికి జిల్లా ఎస్పీ అన్ని ర‌కాలుగా చూస్తార‌న్న భావ‌న. ఈ చిరు కానుక పంపిణీ చేయ‌డం ద్వారా ప్ర‌తీ ఒక్క‌రిలో న‌మ్మ‌కం కలిగిస్తున్నార‌నే చెప్పాలి.

Related posts

హిందీ భాష నేర్చుకోవడం ఎంతో అవసరం

Satyam NEWS

బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు సూర్య పత్రిక విలేకరుల అరెస్టు

Satyam NEWS

సైబర్ నేరాల బారిన పడితే సత్వరమే పిర్యాదు చేయండి

Satyam NEWS

Leave a Comment