39.2 C
Hyderabad
April 23, 2024 15: 53 PM
Slider హైదరాబాద్

ఐదు కుటుంబాలకు డ్రై రేషన్ అంద‌జేత‌

Kovid

భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్ర‌వారం ఐదు కుటుంబాలకు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి డ్రై రేషన్ అందజేశారు. ఈ ఐదు కుటుంబాలు కోవిడ్ బారిన ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో వారికి ఆయా జాగ్ర‌త్త‌లు వివ‌రించారు. కోవిడ్ బారిన ప‌డిన వారు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని తెలంగాణ స‌ర్కార్ వారికి స‌హాయం చేయ‌డంలో ముందుంటుంద‌న్నారు. అలాగే కోవిడ్ బారిన ప‌డిన వారు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఎప్ప‌క‌ప్పుడూ వైద్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తూ క్ర‌మ త‌ప్ప‌నిస‌రిగా స‌రైన పోష‌కాల‌తో కూడిన ఆహారం తీసుకుంటే వ్యాధి త‌గ్గుతుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రమా జ్యోతి, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మారి స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ వెంకన్న, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, మారి కౌన్సిలర్లు సురేందర్, అశోక్, మారి ఛాంపియన్ శివాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

ములుగు జిల్లా పై గులాబీ జెండా ఎగరవేయడం  ఖాయం

Satyam NEWS

విత్తనాలు సకాలంలో అందించే బాధ్యత అధికారులదే

Bhavani

రైతు శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు

Satyam NEWS

Leave a Comment