31.7 C
Hyderabad
April 25, 2024 00: 34 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో శాస్త్రబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

#TTDEOAnilkumarSinghal

రాబోయే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించారు.

ఈ నెల 19 నుండి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వచ్చే నెల 16 నుండి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున స్వామి ఆలయాన్ని సుమారు 10 రకాల సుగంద లేపనాలతో శుభ్రం చేశారు.

ఈ నెల 23 న గరుడసేవ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

కోవిడ్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశానుసారం సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

అగమ సలహాదారులతోపాటు అందరి సూచనలు మేరకు మొదటి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని కూడా ఆయన తెలిపారు.

Related posts

సమష్టి కృషితోనే బాలల పరిరక్షణ సాధ్యం

Satyam NEWS

విషాదంలో సినీ పరిశ్రమ

Murali Krishna

ఉద్యమంలా మాస్కుల పంపిణి కార్యక్రమం అమలు

Satyam NEWS

Leave a Comment